టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) అభిమానులకు ఇది పండగే అని చెప్పాలి. ఆయన నటిస్తున్న తాజా బాలీవుడ్ మూవీ ‘WAR 2’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఎన్టీఆర్ ఏకంగా 10-20 సెకన్ల పాటు షర్ట్ లెస్ (Shirtless) గా కనిపించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను (Fans) తెగ ఎగ్జైట్ చేస్తోంది. ఆయన్ని తెరపై మళ్లీ సిక్స్ ప్యాక్ బాడీ (Six-Pack Body)తో చూడబోతున్నాం. ఇదే కాక, ఆయన ఇంట్రడక్షన్ సీన్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందని సమాచారం. ఈ విజువల్ స్పెషల్ ట్రీట్ (Special Treat)గా ఉండనుందని అంచనాలు ఉన్నాయి.
ఈ హై-బజ్ (High-Buzz) యాక్షన్ మూవీని ఆయాన్ ముఖర్జీ (Ayan Mukerji) డైరెక్ట్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ (Hrithik Roshan-NTR) కాంబినేషన్‌కి భారీ హైప్ నెలకొంది. సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో టెంపర్, అరవింద సమేత లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ తన ఫిట్‌నెస్‌తో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘WAR 2’తో మరింత పవర్‌ఫుల్‌గా రాబోతున్నారు.