ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడ్డారని ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
అంతేకాక, ఈవెంట్ల పేరుతో ఆమెను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి మానసిక మరియు శారీరక వేధింపులకు గురిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్‌పై బయట ఉన్నప్పటికీ, ఈ ఛార్జిషీట్ అతని పరిస్థితిని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి దీనిపై నార్సింగ్ పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.