షారుఖ్‌ను బీట్ చేసిన సీరియల్ బ్యూటీ

షారుఖ్‌ను బీట్ చేసిన ఈ సీరియల్ బ్యూటీ.. ఆస్తి రూ. 250 కోట్లు..

సినిమా హీరోయిన్ల (Cinema Heroines)తో పాటు సీరియల్ బ్యూటీ (Serial Beauties)లకు కూడా ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఇటీవల కాలంలో సీరియల్స్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టినవారు కూడా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ గురించి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ సంపాదిస్తున్నారు. కొందరు హీరోయిన్ల కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులూ ఉన్నారు. ఇటీవల రోజుల్లో చాలా మంది అందగత్తెలు ఓవర్‌నైట్‌లో స్టార్స్‌గా మారిపోయారు. అంతేకాకుండా వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కొందరు హీరోయిన్లు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా హీరోయిన్లే కాదు, సీరియల్ బ్యూటీలు కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించి క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించింది. ఆమెకు స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు, ఆమె ఆస్తులు కూడా స్టార్ హీరోల సంపాదనను మించి ఉన్నాయట. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆమె ఆస్తి మాత్రం రూ. 250 కోట్లకు పైగానే ఉంది. స్టార్ హీరోయిన్లు కూడా ఇంత సంపాదించలేదు. అంతేకాదు, పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఆమె. ఇంతకీ ఆమె పేరేంటంటే.. ఆ సీరియల్ బ్యూటీ మరెవరో కాదు, బాలీవుడ్ నటి (Bollywood Actress) జన్నత్ జుబేర్ (Jannat Zubair). చిన్న వయసులోనే ఈ చిన్నది తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఫాలో అయ్యే వారు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఫాలోవర్స్‌లో షారుఖ్ ఖాన్‌  (Shah Rukh Khan)ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది.

Join WhatsApp

Join Now

Leave a Comment