ఈ ఏడాదిలో జాన్వీ పెళ్లి? జ్యోతిష్యుడి సంచలనం

ఈ ఏడాదిలో జాన్వీ పెళ్లి? జ్యోతిష్యుడి సంచలనం

సినిమా సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. దీని గురించి ఏ చిన్న రూమర్ (Rumor) వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. గతంలో వేణుస్వామి (Venuswami) వంటి వారు ఈ విషయంలో ఎంత రచ్చ చేశారో తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సుశీల్ కుమార్ (Sushil Kumar) అనే జ్యోతిషుడు (Astrologer).. హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పెళ్లి (Marriage) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జ్యోతిష్యుడి అంచనాలు
సిద్ధార్థ్ కన్నన్ (Siddharth Kannan) యూట్యూబ్ ఛానెల్‌ (YouTube Channel)లో మాట్లాడిన సుశీల్ కుమార్.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూనే.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

జాన్వీ కపూర్ వ్యక్తిగత, సినీ ప్రస్థానం
ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్‌కి బాయ్‌ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (‘Peddi’), బన్నీ-అట్లీ (Bunny-Atlee) ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment