‘నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి’.. – కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

'నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి'.. - కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

జనసేన (JanaSena) పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ (Kiran Royal) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కిరణ్‌పై మోసపోయానంటూ లక్ష్మి(Lakshmi) అనే బాధితురాలు వరుస ఆధారాలను బయటపెడుతూ సంచలనం రేపుతోంది. తాజాగా మరో ఆడియో క్లిప్‌ (Audio Clip) వైరల్‌ అయ్యింది. కూటమి అధికారంలోకి రాగానే బాధితురాలికి డబ్బులు తిరిగి చెల్లిస్తానని కిరణ్‌ హామీ ఇచ్చినట్లు ఈ ఆడియోలో స్పష్టమవుతోంది.

అసభ్యకర వ్యాఖ్యలతో మరో వివాదం
ఈ ఆడియో క్లిప్‌లో కిరణ్‌ రాయల్‌ అమ్మాయిల గురించి అసభ్యకరంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. ‘‘నాకు అమ్మాయిలు వీక్‌నెస్‌. లైఫ్‌లాంగ్‌ మారను. కానీ, నిన్ను బాగా చూసుకుంటా. జనసేన నుంచి తిరుపతి నియోజకవర్గానికి పోటీ చేయాలంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలంట‌. నేను అంత ఖ‌ర్చు పెట్టుకోలేను అని చెప్పేశా. సీటు ఇవ్వ‌న‌ని చెప్పేశారు. టీడీపీకి తిరుప‌తి సీటు క‌న్ఫామ్ అయ్యింది. టీడీపీ అభ్య‌ర్థి రూ.25, 30 కోట్లు ఖ‌ర్చు పెట్టుకుంటారట‌. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవి ఇవ్వ‌మ‌ని అడిగాను. అప్పుడు నీ డబ్బులు తిరిగి ఇస్తా’’ అని ఆడియోలో కిరణ్‌ పేర్కొన్నాడు.

నా కూతురు మీద ఒట్టు.. నా గతం ఇదే!
ఆడియోలో కిర‌ణ్ రాయ‌ల్ అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు. తనకు అక్రమ సంబంధాలపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉందని చెబుతున్నట్లుగా ఉంది. ‘‘నా కూతురు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా. నిన్ను మోసం చేయాలని అనుకోలేదు. నీకు తెలిసిన కొంతమంది గురించే తెలుసు. కానీ, గత ఏడాది రోజుల్లోనే ఆరుగురితో సంబంధం పెట్టుకున్నా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిల ఇంటికి వెళ్తున్నా. మొత్తంగా నాకు 400 మందితో సంబంధం ఉండొచ్చు. నాకు అమ్మాయిల పిచ్చి.. రోజుకో అమ్మాయి కావాలి’’ అంటూ లక్ష్మీ విడుదల చేసిన ఆడియోలో కిరణ్ మాట్లాడాడు. ఈ వివాదంపై జనసేన అధిష్ఠానం ఎలా స్పందించనుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment