పుష్ప సినిమా (Pushpa Movie) డైలాగ్ (Dialogue)తో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పల్నాడు (Palnadu)లో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister)) వైఎస్ జగన్ (YS Jagan) పర్యటన సందర్భంగా పుష్ప-2 (Pushpa-2)సినిమా డైలాగ్‌తో ఫ్లెక్సీ (Flex Banner) ప్రదర్శించిన వ్యక్తిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే బొల్లెదు రవితేజ (Bolledu Raviteja) అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త (TDP Worker) అని, అతనికి టీడీపీ సభ్యత్వం ఉందని ఆధారాలను బయటపెట్టింది వైసీపీ(YSRCP). రవితేజ తండ్రి కూడా తన కొడుకు టీడీపీ కార్యకర్త అని అంగీకరించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ (JanaSena Party) రాష్ట్ర స్థాయి నాయకుడి బూతు పురాణం వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. ఫోన్‌లో అవతలి వ్యక్తి సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ.. అతని పుట్టుక ఉద్దేశిస్తూ అత్యంత దారుణంగా మాట్లాడిన జననేతపై ప్రజలు మండిపడుతున్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర (Tatam Shetty Nagendra)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అతన్ని అరెస్టుకు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జనసేన నేత నాగేంద్ర కులం పేరుతో ఓ వ్యక్తిని దూషిస్తూ, వారి ఇంట్లోని మహిళల పట్ల అసభ్యంగా, నీచంగా మాట్లాడిన వీడియోపై నెటిజన్లు, రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. “ఇదేనా జనసేన సంస్కారం?” అంటూ డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “వినడానికే అసహ్యంగా ఉన్న ఈ మాటలపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రజలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.
బూతుల పార్టీగా మారిన #Janasena
— greatandhra (@greatandhranews) June 19, 2025
అధికారం మదంతో పచ్చి బూతులతో రెచ్చిపోయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర.
ఇప్పుడు ఈయనపై కేసు నమోదు చేస్తారా? pic.twitter.com/uSkhRJBHtu
“సినిమా డైలాగ్ ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం, మహిళలను, కులాన్ని అసభ్యంగా దూషించిన జనసేన నేతపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన అసభ్య వ్యాఖ్యలను తవ్వితీస్తూ “మీ సంస్కారవంతమైన భాష ఇదేనా?” అంటూ ఎక్స్‌లో ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ మాత్రం జగన్ “రప్పా రప్పా” డైలాగ్‌తో ఫ్లెక్సీలు పెట్టించారని ఆరోపిస్తూ, రవితేజ టీడీపీ కార్యకర్త అనే వాదనపై స్పందించకుండా పుష్ప డైలాగ్‌ను హైలైట్ చేస్తోంది.
నాగేంద్ర వీడియోపై జనసేన, టీడీపీ నాయకత్వం ఇంతవరకు అధికారికంగా స్పందించకపోవడం, సినిమా డైలాగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం నాగేంద్రపై చర్యలు తీసుకుంటుందా, లేక ఈ వివాదాన్ని దాటవేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మహిళల పట్ల అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మాత్రం తీవ్రమయ్యాయి.