‘జ‌న‌సేన ఎమ్మెల్యేకు అధికార మ‌దం’.. ఎమ్మార్పీఎస్ నేత ఫైర్‌

'జ‌న‌సేన ఎమ్మెల్యేకు అధికార మ‌దం'.. ఎమ్మార్పీఎస్ నేత మండిపాటు

డాక్ట‌ర్ బీఆర్‌.అంబేడ్క‌ర్ (B. R. Ambedkar) కోన‌సీమ జిల్లా పి.గ‌న్న‌వ‌రం జ‌న‌సేన ఎమ్మెల్యే (Janasena MLA) తీరుపై మాదిగ రిజర్వేషన్ల (Madiga Reservations) పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అధికారమ‌దంతో రెచ్చిపోతున్నాడ‌ని ఎమ్మార్పీఎస్ (MRPS) నేత చేట్ల రామారావు (Chetla Rama Rao) తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వ ఎమ్మెల్యేలు మాదిగ‌ల‌ను చిన్న‌చూపు చూస్తున్నార‌ని, గిడ్డి స‌త్య‌నారాయ‌ణ (Giddi Satyanarayana)  క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే త‌గిన బుద్ధిచెబుతామ‌ని ఓ వీడియో విడుద‌ల చేస్తూ హెచ్చ‌రించారు.

ఎమ్మార్పీఎస్ నేత రామారావు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జగ్గన్నపేట నుంచి వస్తున్న ఎమ్మెల్యే కారుకు నేదునూరి రాజేష్ (Nedunuri Rajesh) ఆటో ఎదురుగా వెళ్లింది. ఆటో పక్కకు తీయలేదని ఎమ్మెల్యే గన్‌మెన్ ఆటోడ్రైవర్‌పై తీవ్రంగా ఆగ్రహించారు. ఆ ఆటోడ్రైవర్ నేదునూరు రమేశ్ తమ సోదరుడని తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు వెంటనే ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అయితే, ఆ తర్వాత ఆటోడ్రైవర్ రాజేష్‌ను కార్యాలయానికి తీసుకువచ్చి దారుణంగా భయపెట్టారని ఎమ్మార్పీఎస్ నేత చేట్ల రామారావు ఆరోపించారు. గిడ్డి విజయానికి తాము ఎంతగానో కృషి చేశామనీ, ఇప్పుడు మాదిగ జాతికి అవమానం జరుగుతుందనడం సిగ్గుచేటని మండిపడ్డారు.

“మాదిగ జాతికి గిడ్డి సత్యన్నారాయణ క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తాం. గిడ్డిపై కఠిన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ మాదిగల పట్ల తన నిజాయితీని నిరూపించాలి” అని రామారావు హెచ్చరించారు.

అదేవిధంగా, వైసీపీ పాలనలో వైఎస్ జగన్(YS Jagan) మాదిగలకు గౌరవం ఇచ్చి ఎమ్మెల్సీ పదవి కల్పించారని గుర్తు చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదిగల పట్ల గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తక్షణమే స్పందించాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment