ద‌మ్ముంటే నిరూపించు.. టీడీపీ ఎమ్మెల్యేపై బాలినేని ఫైర్‌

ద‌మ్ముంటే నిరూపించు.. టీడీపీ ఎమ్మెల్యేపై బాలినేని ఫైర్‌

ఒంగోలు (Ongole) రాజకీయాల్లో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ (Damacharla Janardhan)పై జనసేన నాయకుడు (Jana Sena Leader) బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి (Balineni Srinivasa Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే పేరు చెప్పినా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని బాలినేని వ్యాఖ్యానించారు.

ఇసుక (Sand), మైనింగ్ (Mining) అక్రమ రవాణా (Illegal Transportation) ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భూదందాలు పెరిగిపోయాయని, కనపడిన భూమిని ఆక్రమిస్తూ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మెప్మా అధికారుల అండతో అవినీతికి పాల్పడుతున్న నాయకులపై తక్షణ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తాను వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్నప్పుడు తనపై, తన కుమారుడిపై అనేక ఆరోపణలు చేశారని బాలినేని గుర్తుచేశారు. “దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలి” అని సవాల్ విసిరారు. ప్రస్తుతం తాను ప్రజల తరఫున ప్రశ్నించే పార్టీ లో ఉన్నానని, ఎమ్మెల్యే దందాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే అక్రమాలపై సొంత పార్టీ నాయకులే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారని, ఆ విషయాన్ని తనపై మోపడం సరైంది కాదని బాలినేని అన్నారు. “నిరూపించగలరా?” అంటూ సవాల్ చేశారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఒంగోలు రాజకీయాల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment