గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్ (Head Constable)పై జనసేన నేత (JanaSena Leader) దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటన నంద్యాల (Nandyala)లో సంచలనంగా మారింది. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణి (Mani)ని జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్ (Pidatala Sudhakar) చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల భగత్ సింగ్ కాలనీ సమీపంలోని కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లను (Gutka Packets) అమ్ముతుండగా హెడ్ కానిస్టేబుల్ ఫోటోలు తీసాడు. దీంతో, హెడ్ కానిస్టేబుల్ మణితో షాపు యజమాని లక్ష్మీ (Lakshmi) ఘర్షణకు దిగారు.
కాగా, సమీపంలోనే మద్యం తాగుతున్న సుధాకర్ , అతని బ్యాచ్ కు ఫోన్ చేసిన ఈ విషయం చెప్పింది షాప్ యజమాని లక్ష్మీ. దీంతో, కారులో ఘటనా స్థలానికి చేరుకున్న సుధాకర్ అండ్ బ్యాచ్.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి దిగింది.. అయితే, తాను పోలీసునని చెప్పినా వినిపించుకోకుండా.. సుధాకర్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు..
ఈ వ్యవహారంపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణ (SP Adhiraj Singh Rana)కు హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.. మరోవైపు ఘటనా స్థలాన్ని చేరుకున్న రూరల్ సీఐ ఈశ్వరయ్య (CI Eeshwarayya), పోలీసులు.. అసలు దాడికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు.. మరోవైపు.. జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్ పరారయ్యాడు.. మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఘటనపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కొట్టినట్టు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సుధాకర్ కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు రూరల్ పోలీసులు.