నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) నుంచి కొత్త హీరో (New Hero) సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నందమూరి హరికృష్ణ కుమారుడు, కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య స్వర్గీయ నందమూరి జానకిరామ్ కుమారుడు (Late Nandamuri Janakiram’s Son) తారక రామారావు (Taraka Ramarao) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ యువ హీరో తొలిసినిమాకి ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (YVS Chowdary) దర్శకత్వం వహించనున్నాడు.
ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటించనుండగా, ఈ చిత్రం ‘న్యూ ట్యాలెంట్ రోర్స్’ (‘New Talent Roars’) బ్యానర్ (Banner) పై నిర్మితమవుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు నందమూరి కుటుంబం నుంచి పలువురు హాజరయ్యారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, అలాగే కుమారులు మోహన కృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభ వేడుకలో భువనేశ్వరి క్లాప్ కొట్టగా, పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేశారు. ఈ సందర్భం ప్రతి ఒక్కరికీ భావోద్వేగకరంగా మారింది. తారక్ రామారావు తొలిసారి వెండితెరపైకి వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.







