యువతిపై గ్యాంగ్ రేప్‌.. ప‌ది మంది నిందితులు అరెస్టు

యువతిపై పది మంది యువకుల సామూహిక లైంగికదాడి.. నిందితులు అరెస్టు

జనగామ (Janagama)లో ఒక యువతి (Young Woman)పై సామూహిక లైంగికదాడికి (Sexual Assault) పాల్పడిన పది మంది నిందితులను పోలీసులు (People) అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువతిపై మహమ్మద్ ఒవైసీ (Mohammed Owaisi), ముత్యాల పవన్ కుమార్ (Muthyala Pavan Kumar), బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి అబ్దుల్ ఖయ్యూం, పుస్తకాల సాయి తేజ, ముత్తాడి సుమంత్ రెడ్డి, గుండ సాయి చరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం అనే పది మంది యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు.

ఈ ఘటన జూన్ నెలలో జరిగింది. యువతిని స్నేహం, ప్రేమ పేరుతో కారులో తీసుకెళ్లి, జనగామ-సూర్యాపేట రోడ్డులోని ‘టీ వరల్డ్’ (‘Tea World’) వెనుక ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక యువకుడు బాధితురాలిని ప్రేమిస్తున్నానని నమ్మించి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా పలుమార్లు శారీరకంగా కలిశాడు.

ఈ విషయంపై బాధితురాలి పిన్ని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సిద్దిపేట రోడ్డులో ఉన్నారనే సమాచారంతో సీఐ దామోదర్ రెడ్డి (Damodar Reddy), ఎస్సై భరత్ (SP Bharath) వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రజలకు పోలీసులు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, యువత మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని ఏఎస్పీ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment