తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి తాజాగా మరో వీడియో విడుదల చేశారు. జైపూర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, తిరుపతి రాగానే సాక్ష్యాలతో సహా అన్ని నిరూపిస్తానని చెప్పారు. కేసులో తన ప్రమేయం లేదని కోర్టు నమ్మింది కాబట్టే బెయిల్ మంజూరు చేసిందన్నారు.
తిరుపతి పోలీసులపై నమ్మకం చాలా నమ్మకం పెట్టుకున్నానని, కానీ, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసులు సపోర్టు చేస్తారని చాలా స్పష్టంగా అర్థమైందన్నారు. అన్యాయం జరిగింది అండగా నిలబడండి అని చేతులెత్తి వేడుకున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి రాగానే సాక్ష్యాలతో సహా అన్ని నిరూపిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఓ న్యూస్ యాప్ ద్వారా తన మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, దాని వెనక ఎవరున్నారో.. వారిపై కూడా కేసు ఫైల్ చేస్తానని చెప్పారు. ఈ వ్యవహారంలో ఉన్న మరో వ్యక్తి గురించి పూర్తిగా చెప్తానని ప్రకటించారు. అయితే జైపూర్ నుంచి తాను సేఫ్‌గా తిరుపతి వస్తాననే నమ్మకం తనకు లేదని, తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కిరణ్ రాయల్ మాత్రమేనని రిలీజ్ చేసిన వీడియోలో ప్రకటించారు. తిరుపతి ఎస్పీకి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేస్తే.. ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేశారో, లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.