తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ (Ilaya Thalapathy Vijay) నటించనున్న చివరి సినిమా (Vijay Last Movie) టైటిల్ రిలీజ్ అయ్యింది. రాజకీయ పార్టీ స్థాపించి తమిళనాడు ప్రజలకు దగ్గరవ్వాలనుకుంటున్న విజయ్ ఇక సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను చకచకా పూర్తి చేసి ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌లో బిజీ అవ్వాలనుకుంటున్నారు.
విజయ్ నటించి చివరి చిత్రం టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ‘జన నాయగన్’ (Jana Nayagan)గా సినిమా పేరు నిశ్చయించారు. ఈ విషయాన్ని విజయ్ (Thalapathy Vijay) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. పోస్టర్ షేర్ చేయడంతో పాటు, ఈ సినిమా తన కెరీర్‌కు మంచి ముగింపుగా నిలుస్తుందని సంకేతాలిచ్చారు.
#JanaNayagan pic.twitter.com/cs51UDEi1Q
— Vijay (@actorvijay) January 26, 2025
బాలకృష్ణ నటించిన హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ రీమేక్ (Bhagavanth Kesari Remake)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో రాజకీయపరమైన సందేశాన్ని చొప్పించడంతో పాటు, విజయ్ TVK (తలపతి విజయ్ కసరతు) పేరుతో రాజకీయ పార్టీ ఆరంభానికి సంకేతాలివ్వనున్నట్లు సమాచారం. అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి విజయ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.








