భారత (India) మాజీ (Former) ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ (Jagdeep) ధన్‌ఖర్ (Dhankhar)కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ధన్‌ఖర్ కోసం బుక్ చేసిన మూడు బుల్లెట్‌ప్రూఫ్ (Bulletproof) కార్ల (Cars)ను కేంద్రం నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇటీవల ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా (Resignation) చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తనకు వ్యతిరేకంగా ఉందని ముందస్తు అప్రమత్తతతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సంవత్సరమే వయసు రీత్యా కొత్త బుల్లెట్‌ప్రూఫ్ (Bulletproof) వాహనాలను ఏర్పాటు చేయాలని ధన్‌ఖర్ కేంద్రాన్ని కోరారు. దీనిపై పరిశీలన కోసం జూన్‌లో హోంమంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. నవంబర్ నాటికి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని ధన్‌ఖర్ భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా జూలై 22 సాయంత్రం అనారోగ్య కారణాలను చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా, ధన్‌ఖర్ పెట్టిన ఈ ప్రతిపాదనను కేంద్రం నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.