NCLTలో వైఎస్ జగన్‌కు ఊరట..

NCLTలో వైఎస్ జగన్‌కు ఊరట..

హైదరాబాద్‌ (Hyderabad) లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి ఊరట అందించింది. ఆయన, తన తల్లి వైఎస్ విజయలక్ష్మి (YS.Vijayalakshmi), చెల్లి వైఎస్ షర్మిల (YS.Sharmila) మధ్య జరుగుతున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ (Saraswati Power Industries) షేర్ల వివాదంలో తాత్కాలికంగా షేరు బదిలీని నిలిపివేస్తూ ఎన్సీఎల్టీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ వేసిన పిటిషన్‌లో ఆయన ఆరోపించిన మేరకు – తమ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీలోని 51.01% వాటాను తల్లి విజయలక్ష్మితో కలిసి చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని తెలిపారు. ఈ షేర్ బదిలీ తన అనుమతి లేకుండా, పూర్తి సమాచారం లేకుండా జరగడం చట్ట విరుద్ధమని ఆయన కోర్టులో వివరించారు. కంపెనీ వ్యవస్థాపకుడిగా తన హక్కులను అపహరించే ఈ చర్యపై స్పందిస్తూ, తక్షణ విచారణ కోరారు.

పరిశీలన అనంతరం ట్రైబ్యునల్, జగన్ వాదనలకు విచారణ అవసరముందని భావించింది. తదుపరి విచారణ వరకు షేర్ల బదిలీపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో జగన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment