తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (Guntakandla Jagadish Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు (Chandrababu) కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
“లేని గొప్పలు, అజ్ఞానం”
తిరుమలగిరి (Tirumalagiri) సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌కు “లేని గొప్పలు చెప్పుకోవడం అలవాటు” అని ఎద్దేవా చేశారు. తిరుమలగిరి సభకు స్పందన లేకపోవడంతోనే సీఎం “బూతులు” మాట్లాడారని ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి అజ్ఞానం బయటపడిందని, చంద్రబాబు చెప్పిన మాటలనే ఆయన మాట్లాడుతున్నారని, తద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పబోతున్నారని, బనకచర్ల కోసం మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంపై సవాళ్లు
మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తు చేస్తూ, తమ హయాంలో పంపిణీ జరగలేదని రేవంత్ అంటే అందుకు చెంప దెబ్బకు సిద్ధమా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాను ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దామని, ధాన్యం ఉత్పత్తిని 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీలు, యాదాద్రి టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయని, మరి సీఎం రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా అని సవాల్ చేశారు. “నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా?” అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.







