స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘జాక్ (Jack)’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, మేకర్స్ ట్రైలర్ (Trailer) ను విడుదల చేశారు. సిద్ధు తనదైన స్టైల్‌లో మాస్ డైలాగులతో యూత్‌ను ఆకట్టుకోగా, వైష్ణవి చైతన్య గ్లామర్‌తో అలరించింది.
సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ కాగా, ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలదా? అనేది ఏప్రిల్ 10న తెలియనుంది.