బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు (Bucchibabu) సానా (Sana) ‘ఇట్లు మీ ఎదవ’ (Itlu Mee Yedava) అనే యువతరం చిత్రాన్ని లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ (Title Glimpse) చాలా బాగుంది. ఇది ప్రతి అబ్బాయి జీవితానికి సరిపోయే టైటిల్. ఫన్నీగా ఉంది. ఇది మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఇది యువతను ఆకర్షిస్తుంది. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్!” అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవి ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల నాలుగు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న జగదీష్ చీకటి ఈ చిత్రానికి డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్.బి. ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.








