హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరాయి. పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిపతుల ఇళ్లు, ఆఫీసులే టార్గెట్‌గా ఇన్‌కంట్యాక్స్ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు నిర్మాతల మూడు రోజులుగా సోదాలు చేస్తున్నారు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఇవాళ రెండో రోజు సోదాలు జరుగుతుండగా, ప్రముఖ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.
ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి కీలక సమాచారం బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా, కొన్ని పెద్ద సంస్థల లావాదేవీలు ఐటీ శాఖ దృష్టికి రావడంతో పరిశీలన మరింత కఠినంగా సాగుతోంది.
భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాత ఇళ్ళు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న 55 బృందాలుగా ఏర్పడిన అధికారులు గేమ్ ఛేంజర్, పుష్ప సినిమాల నిర్మాతల ఇళ్లు, ఆఫీస్‌లలో ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో ఐటీ రైడ్స్ కొనసాగాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టుబడులు, ఆదాయం పైన ఆరతీశారు. ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలించారు.