హమాస్‌పై ఇజ్రాయెల్ మ‌రో భీకర దాడి

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరొక క్రూర ఘట్టం చోటుచేసుకుంది. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) గాజాపై మరోసారి తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు హతమయ్యారు. దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రిని లక్ష్యంగా తీసుకున్న ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు అక్కడే తలదాచుకున్నారన్న సమాచారం మేరకు దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఆసుపత్రి అత్యవసర విభాగం పూర్తిగా దెబ్బతిన్నది.

యుద్ధం మళ్లీ ముదురుతున్నదా?
గత ఏడాది నుంచి గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు నిర్వహిస్తోంది. మధ్యవర్తుల ఒప్పందంతో ఖైదీ-బందీల మార్పిడి జరిపినా, అది త్వరలో ముగిసింది. ఇజ్రాయెల్ మరోసారి హమాస్‌పై ఉక్కుపాదం మోపాలని తలంచింది. దీంతో గాజాలో మళ్లీ రణరంగ వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment