“నీ బ్రతుకేంత? ఒళ్లు దగ్గర పెట్టుకో!” : రఘురామపై ఐపీఎస్ ఫైర్‌ (Video)

"నీ బ్రతుకేంత? ఒళ్లు దగ్గర పెట్టుకో!" : రఘురామపై ఐపీఎస్ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఐపీఎస్ వర్సెస్ డిప్యూటీ స్పీక‌ర్ వివాదం ముదురుతోంది. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్‌ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) వ్యాఖ్య‌ల‌పై ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ (P.V. Sunil Kumar) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. అత్యంత ఘాటైన పదజాలంతో రఘురామకు వార్నింగ్ ఇచ్చారు.

సంస్కారం లేదా?
రఘురామ వాడుతున్న భాషపై సునీల్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “గౌడి గేదె లాగా పెరిగావు.. నీకు కనీస సంస్కారం లేదా? మీ అమ్మనాన్నలు నీకు సంస్కారం నేర్పించలేదా?” అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో పనిచేసే చిన్నవారిని కూడా ‘బాబు’ అని పిలిచే గొప్ప సంస్కారం ఉంటుందని, అలాంటిది రఘురామ ‘వీడు, వాడు’ అని సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

కోటు వేసుకుంటే నీ సొమ్మా?
తన వేషధారణపై రఘురామ చేసిన వ్యాఖ్యలకు సునీల్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. “నేను కోటు వేసుకుంటే నీకేంట్రా? నేనేమైనా నీ సొమ్ముతో కొని ఇచ్చావా? నువ్వు పొద్దున్న లేస్తే బ్యాంకులను మోసం చేస్తే గానీ బ్రతకలేవు. ఆ డబ్బులు లేకపోతే నీకు బ్రతుకే లేదు” అంటూ రఘురామ ఆర్థిక లావాదేవీలపై (Financial Dealings) ఘాటు విమర్శలు చేశారు. రఘురామ అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఎంగిలి మెతుకులు తినే కుక్కలను తయారు చేసుకున్నావు. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను. పిచ్చి ఛానళ్లను కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ సంస్కారం తప్పి, హద్దులు దాటి మాట్లాడితే ఎవరూ పడి ఉండరు” అని హెచ్చరించారు.

చివరగా స్ట్రాంగ్ వార్నింగ్
“మేము కూడా వాడు, వీడు అని అనగలం. నువ్వెంత? నీ బ్రతుకెంత? నన్ను అనడానికి నువ్వు ఎవరు? ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. లేదంటే నేను కూడా తిట్టాల్సి ఉంటుంది” అంటూ సునీల్ కుమార్ తన వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సునీల్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ మరియు పోలీసు వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక ఐపీఎస్ అధికారి ఇంత బహిరంగంగా ఎమ్మెల్యేపై విరుచుకుపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment