తాడిపత్రి (Tadipatri) టీడీపీ (TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి కూటమి ప్రభుత్వం (Coalition Government) భారీ షాక్ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవల తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి (Rohit Kumar Choudhary ) అంతు చూస్తా, జిల్లాలో లేకుండా చేస్తానని పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం రోజున టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) శపథం చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరగా, ప్రభుత్వం ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వైపు మొగ్గు చూపి జేసీకి భారీ షాక్ ఇచ్చింది.
తాడిపత్రి ఏఎస్పీగా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిను మరో ఏడాది పాటు అదే పదవిలో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట రోహిత్ కుమార్ చౌదరి నవంబర్ 10, 2024 నుంచి జనవరి 2026 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం హాజరుకావాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను రద్దు చేసింది. దీంతో రోహిత్ తాడిపత్రిలోనే విధులు కొనసాగించనున్నారు.
ఇటీవల టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, రోహిత్ కుమార్ చౌదరి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. రోహిత్ ను వెంటనే బదిలీ చేయాలని మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, ప్రభుత్వం ఆ ఒత్తిడిని పట్టించుకోకుండా, రోహిత్ కుమార్ చౌదరి సేవలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తాడిపత్రిలో చర్చనీయాంశమైంది.
రోహిత్ కుమార్ చౌదరి కఠినమైన విధానాలు, చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడంలో ప్రసిద్ధి పొందిన అధికారి. ఆయన కొనసాగింపు తాడిపత్రి ప్రజలలో సంతోషాన్ని కలిగించగా, టీడీపీ వర్గాల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది.









