---Advertisement---

అతి త‌క్కువ స్కోర్‌తో పంజాబ్ రికార్డ్‌

అతి త‌క్కువ స్కోర్‌తో పంజాబ్ రికార్డ్‌
---Advertisement---

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2025లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) చరిత్రలో నిలిచిపోయే విజయం నమోదు చేసింది. మంగ‌ళ‌వారం రాత్రి కోల్‌క‌తా (Kolkata)తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో, పంజాబ్ కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్ పరంగా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. అయితే, తమ బౌలింగ్ అస్త్రాలతో అద్భుతంగా రాణించిన పంజాబ్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను ల‌క్ష్యం చేర‌కుండా అడ్డుకుంది.

ఈ గెలుపుతో పంజాబ్ ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (Lowest Score) (112) డిఫెండ్ చేసి గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇదివరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2009లో చెన్నై 116 పరుగులను డిఫెండ్ చేసి విజయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు (Record)ను పంజాబ్ చెరిపేసింది. ఈ రికార్డు పంజాబ్ ఆట‌గాళ్ల‌లో, యాజ‌మాన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

గ‌తంలో త‌క్కువ స్కోర్ చేసిన జ‌ట్లు
SRH vs MI – 118 (SRH)
PBKS vs MI – 119 (PBKS)
SRH vs PW – 119 (SRH)
MI vs PW – 120 (MI)
PBKS vs SRH – 125 (PBKS)

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment