ఈసారి IPL 2025 మరింత ప్రత్యేకంగా ప్రారంభంకానుంది. మార్చి 22న ప్రారంభమయ్యే 18వ సీజన్ కోసం బీసీసీఐ కొత్త విధానాన్ని అనుసరించాలని యోచిస్తోంది. సాధారణంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ మొదటి మ్యాచ్ జరిగే వేదికలో మాత్రమే నిర్వహించేవారు. కానీ, ఈసారి మాత్రం టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే 13 స్టేడియాల్లోనూ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బోర్డు యోచిస్తున్నట్టు సమాచారం.
అందుకే, ప్రతి స్టేడియంలో జట్టుకు తొలి మ్యాచ్ ముందు ఓ ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కొత్త ప్రయోగం ఐపీఎల్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించనుంది. ఇకపోతే, బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.