ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నేడు జరగనుంది. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు అభిమానులను ఉత్కంఠలో ముంచనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
SRHకు భారీ షాక్
ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యువ హిట్టర్ అనికేత్ వర్మ (Aniket Verma) గాయపడినట్లు (Injured) సమాచారం. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో నెట్‌బౌలర్ వేసిన బంతి అతని కాలి బొటనవేలికి బలంగా తాకింది. ఈ ఘటనతో అతను గాయం పొందినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో SRH జట్టు ఎలా మార్పులు చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే, ఈడెన్ గార్డెన్స్ మైదానంలోని పిచ్ నేడు ఎలా ఉంటుందోనన్నది కూడా ఆసక్తికరంగా మారింది.