SRH vs LSG మ్యాచ్‌లో ఉద్రిక్తత.. అభిషేక్, దిగ్వేశ్ వాగ్వాదం

SRH vs LSG మ్యాచ్‌లో ఉద్రిక్తత.. అభిషేక్, దిగ్వేశ్ వాగ్వాదం

లక్నో (Lucknow)లోని భారత‌ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియం (Bharat Ratna Atal Bihari Vajpayee Ekana Cricket Stadium)లో జరిగిన ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. స‌న్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బౌలర్ దిగ్వేశ్ రాఠీ (Digvesh Rathi) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన మైదానంలో ఉద్రిక్తతను సృష్టించి, క్రీడాభిమానులను షాక్‌కు గురిచేసింది. అంపైర్లు, ఇతర ఆటగాళ్ల జోక్యంతో విషయం సద్దుమణిగింది.

సంఘటన వివరాలు
మ్యాచ్‌లో LSG 205/7 స్కోరును నమోదు చేసిన తర్వాత, SRH త‌న 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ, కేవలం 20 బంతుల్లో 59 పరుగులు (6 సిక్సర్లు, 4 ఫోర్లు) సాధించాడు. అతను రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి, 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ దూకుడైన బ్యాటింగ్‌తో SRH ఏడు ఓవర్లలో 98/1 స్కోరుతో ఆధిపత్యం చెలాయించింది.

అయితే, దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో అభిషేక్ డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. వికెట్ తీసిన సంతోషంలో రాఠీ తన సిగ్నేచర్ “నోట్‌బుక్ సెలబ్రేషన్” చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా సెలబ్రేషన్‌లో అభిషేక్‌కు “వెళ్లిపో” అన్నట్లు సైగ చేశాడు. దీనిపై అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకురాగా, వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను గమనించిన అంపైర్లు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేశారు. LSG కెప్టెన్ రిషబ్ పంత్ కూడా వచ్చి పరిస్థితిని శాంతింప‌జేయ‌డంతో సహాయపడ్డాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగినప్పటికీ, తర్వాత సాధారణ స్థితికి చేరుకుంది.

మ్యాచ్ ఫలితం
అభిషేక్ శర్మ 20 బంతుల్లో 59 పరుగుల ఆటతీరు, ఇషాన్ కిషన్ (35), హెన్రిచ్ క్లాసెన్ (47), కమిందు మెండిస్ (30+) ల సహకారంతో ఎస్‌ఆర్‌హెచ్ 18.2 ఓవర్లలో 206/4 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చ‌ల్లింది.

Join WhatsApp

Join Now

Leave a Comment