తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ తర్వాత ఫీజు చెల్లింపునకు మరోసారి గడువు పొడిగించేందుకు అవకాశం లేదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల తేదీలు
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదే విధంగా, మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడం ఖాయమైంది. విద్యార్థులు పరీక్షలు సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.