తెలంగాణకు అన్యాయం.. ‘పద్మ’ అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణకు అన్యాయం.. 'పద్మ' అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు గొప్ప వ్యక్తుల పేర్లు పద్మ అవార్డుల కోసం అధికారికంగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి తమ జీవితాలను త్యాగం చేసిన వారి కృషిని కేంద్రం గౌరవించలేదని అన్నారు. “వీరిలో ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. “వీరిలో ఎవరికీ అర్హత లేదా?” అని ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రజల ఆవేదనను కేంద్రం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. సమాజానికి సేవచేసిన వ్యక్తుల కృషికి గౌరవం అందకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment