కెనడా (Canada) లో భారతీయులపై దాడులు (Attacks) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ భారతీయుడు (Indian) ఒట్టావా (Ottawa) లో దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తితో నిందితుడు దాడి చేసి హత్య (Murder) చేసినట్లు భారత రాయబార (Indian Embassy) కార్యాలయం వెల్లడించింది. ఈ విషాద ఘటనపై స్పందించిన భారత ఎంబసీ, మృతుడి కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉండనున్నట్లు తెలిపింది. అలాగే, ఘటనకు సంబంధించిన అనుమానితుడిని (Suspect) పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. అయితే, మృతుడి వ్యక్తిగత వివరాలు ఇంకా వెల్లడించలేదు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే హత్యకు గల కారణాలపై స్పష్టత రాలేదని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, భారత ఎంబసీ స్థానిక కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య