అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ – విదేశాంగ శాఖ వెల్లడి

అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ – విదేశాంగ శాఖ వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా (America) నుంచి ఈ ఏడాది జనవరి 20 తర్వాత ఇప్పటివరకు 1,563 మంది భారతీయులను (Indians) బహిష్కరించి స్వదేశానికి పంపినట్లు భారత విదేశాంగ శాఖ (Indian Ministry of External Affairs) అధికారికంగా ప్రకటించింది.

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) తెలిపిన వివరాల ప్రకారం, బహిష్కరించిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాల ద్వారానే భారత్‌కు తీసుకువచ్చారు.

ఇది డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాల్లో ఒకటి. ట్రంప్‌ అధ్యక్ష పదవిలో తొలి నెలలోనే అమెరికా మొత్తం 37,660 మంది వలసదారులను తమ స్వదేశాలకు బహిష్కరించిన విషయం గమనార్హం.

దీతో పోలిస్తే, జో బైడెన్ (Joe Biden) అధ్యక్షత్వంలో తొలి నెలల్లో బహిష్కరణల సంఖ్య తక్కువగా ఉండటం విశేషం. ఆయన హయాంలో కేవలం 3,000 మందిని మాత్రమే బహిష్కరించారు.

ఇక తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుతం 18,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నారు. వీరిపై ఎప్పుడు, ఎలా చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment