భారత క్రికెట్ అభిమానులు ఊహించినట్టే జరిగింది. స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తన గర్ల్‌ఫ్రెండ్, సమాజవాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ (MP Priya Saroj)తో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నాడు. ఆదివారం లక్నోలోని హోటల్ ది సెంట్రమ్ (Hotel The Centrum) లో జరిగిన ఈ వేడుక ఎంతో ఘనంగా సాగింది.
ఫోటోలు, వీడియోలు వైరల్
నిశ్చితార్థానికి ముందు జరిపిన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ (Pre-Wedding Photoshoot)లో తీసిన పిక్స్, క్లిప్స్ (Photos and Clips) సోషల్ మీడియాలో సెంచరీ కొడుతున్నాయి. మధురమైన క్షణాల్లో ఇద్దరూ ఎంతో మురిసిపోయినట్లు కనిపించారు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు, 300 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, రింకూ సింగ్‌కు సన్నిహితమైన భారత యువ క్రికెటర్లు హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం రింకూ సింగ్ ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున ఆడుతున్నాడు.
ప్రియా సరోజ్ – యువ ఎంపీ
ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున మచ్ఛలీషహర్ (Machhalishahar) లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తక్కువ వయస్సులోనే ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందిన ఆమెతో రింకూ నిశ్చితార్థం జరుపుకోవడం రాజకీయ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట నవంబర్ 18న వారణాసిలో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే వీరి జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.