---Advertisement---

తొలి టీ20.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌

తొలి టీ20 ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌
---Advertisement---

భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించలేక‌పోయింది. భార‌త బౌల‌ర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్క‌రుగా పెవిలియ‌న్ బాటప‌ట్టారు. ఈడెన్ గార్డెన్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ప్రారంభ‌మైంది. తొలి టీ20లో టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 132 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఓపెనర్లుగా వ‌చ్చిన సాల్ట్‌, బెన్‌ను అర్ష‌దీప్ త‌న బౌలింగ్‌తో భ‌య‌పెట్టాడు. తొలి ఓవ‌ర్‌లో మూడో బంతికే సాల్ట్ వికెట్ స‌మ‌ర్పించాడు. మూడో ఓవ‌ర్‌లో బెన్ అర్ష‌దీప్‌కు వికెట్ ఇచ్చి పెలియ‌న్‌కు చేరాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న బౌలింగ్‌లో కేవ‌లం 23 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టి హ‌య్య‌స్ట్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. అక్ష‌ర్ రెండు, అర్ష‌దీప్ రెండు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో తెలుగు ప్లేయ‌ర్ నితీశ్‌రెడ్డి రెండు అద్భుత‌మైన క్యాచ్‌లు ప‌ట్టి మ్యాచ్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ బ‌ట్ల‌ర్ మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ స్కోర్ చేసి.. జ‌ట్టును ఆదుకున్నాడు. 44 బంతుల్లో 68 ప‌రుగులు చేశాడు. 17వ ఓవ‌ర్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌కు బౌండ‌రీ లైన్‌లో నితీశ్‌రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ 132 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment