ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పరిచింది. మూడో టెస్టులో బౌలర ఆదిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
భారత బ్యాటర్ల నిరాశ
మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జైస్వాల్ (4), గిల్ (1) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. కోహ్లి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం 9 పరుగుకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కే.ఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామానికి రాహుల్ 52 బంతులకు 30 పరుగులు చేయగా, రోహిత్ స్కోర్ 0గా ఉంది.
బౌలర్ల ఆదిపత్యం
ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఆసిస్ బౌలర్లు స్టార్క్ 2 వికెట్లు, హజెల్ వుడ్, కమిన్స్ చెరొక వికెట్ వారి ఖాతాలో వేసుకున్నారు.