భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 (India Under-19) జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా యంగ్ టీమిండియా (Team India) ఆతిథ్య ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది.

ఈ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్టార్ ఆయుష్ మ్హత్రే (Ayush Mhatre) మరోసారి నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌ (Samit Dravid)కు మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు.

ఇంగ్లండ్‌లో అదరగొట్టిన టీమిండియా
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భారత జట్టుకు మ్హత్రే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకోగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

కానీ ఆసీస్‌తో సిరీస్‌ల కోసం మ్హత్రే డిప్యూటీగా విహాన్ మల్హోత్రాను సెలక్టర్లు నియమించారు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన ఆదిత్య రాణా, ఖిలాన్ పటేల్‌లను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. వారిద్దరి స్థానంలో డి. దీపేష్, నమన్ పుష్పక్‌లను ఎంపిక చేశారు.

ఆస్ట్రేలియాలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్:
సెప్టెంబర్ 21: తొలి వన్డే – నార్త్స్

సెప్టెంబర్ 24: రెండో వన్డే – నార్త్స్

సెప్టెంబర్ 26: మూడో వన్డే – నార్త్స్

సెప్టెంబర్ 30 – అక్టోబర్ 3: తొలి టెస్టు

అక్టోబర్ 7 – అక్టోబర్ 10: రెండో టెస్టు

భారత అండర్-19 జట్టు:
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుండు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ సింగ్, కిషన్ కుమార్, అన్మోల్, పటేల్ మోహన్, డి దీపేష్, అమన్ చౌహాన్.

Join WhatsApp

Join Now

Leave a Comment