ఇంగ్లండ్ (England)తో లార్డ్స్ (Lords)లో జరిగిన మూడో టెస్ట్ (Third Test)లో భారత్ 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడింది. జులై 23 నుంచి మాంచెస్టర్ (Manchester)లో ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ (Fourth Test)లో టీమిండియా (Team India) కొన్ని కీలక మార్పులతో (Key Changes) బరిలోకి దిగే అవకాశం ఉంది.
కరుణ్ నాయర్‌కు ఉద్వాసన?
“ఒక్క ఛాన్స్” (Just One Chance) అంటూ సోషల్ మీడియాలో వేడుకున్న బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) పై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (0, 20, 31, 26, 40, 14 పరుగులతో) నిరాశపరిచిన నాయర్ స్థానంలో ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. టెస్ట్ స్పెషలిస్ట్ అభిమన్యు ఈశ్వరన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
పంత్, బుమ్రాపై సందిగ్ధత
మూడో టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ నాలుగో టెస్ట్ ఆడటంపై ఇంకా స్పష్టత లేదు. పంత్ అందుబాటులో లేకపోతే, ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్ భారాన్ని యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజాలు మోయనున్నారు.
వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది.








