భారత జట్టు ప్రదర్శనకు సంబంధించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఆటతీరు బాగుందని, అయితే ఇటీవల జట్టులోని సభ్యుల ఆటతీరు ఆందోళనకరంగా మారిందని ఆయన అన్నారు.
హర్భజన్ అభిప్రాయాలు..
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన హర్భజన్, గత ఆరు నెలలుగా భారత జట్టు ప్రదర్శనలో మార్పులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లలో జట్టు తమ సత్తా నిరూపించుకోవాలని సూచించారు. అదేవిధంగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో ఆటతీరుకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. “జట్టులో ఎవరైనా ఆట కంటే పెద్దవారు కాదు” అని హర్భజన్ తెలిపారు.
ఇటీవల ఆసిస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో విమర్శలకు గురవుతోంది. టాప్ ఆర్డర్స్ బ్యాటింగ్‌లో విఫలమవుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.