అమెరికా (America) మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం, భారత్- పాకిస్తాన్ (India – Pakistan) దేశాలు సంపూర్ణ కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమ్మలోకి వస్తుందని ట్వీట్ చేశారు ట్రంప్.
“అమెరికా మద్దతుతో జరిగిన రాత్రి సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం, భారత్ – పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ పై ఒప్పందం చేసుకున్నాయి. ఇద్దరు దేశాలు గొప్ప నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కామన్‌సెన్స్‌తో కూడిన తెలివైన నిర్ణయం తీసుకున్న భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు!” అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల మధ్య గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.