ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో టీమిండియా (Team India) జట్టు మరోసారి నిరాశపరిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్(India).. వరుసగా రెండో వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది. 2-0తో సిరీస్ ను చేజిక్కించుకొని ఇప్పటికే ఆసీస్ ధీమాగా ఉంది. ఇంకొక్క మ్యాచ్‌లో గెలిస్తే క్లీన్ స్వీప్ తో సిరీస్ ఆసిస్ వశం అయిపోతుంది.
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్, గిల్‌లు ఆరంభంలో చక్కగా ఆడినప్పటికీ మధ్య ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడంతో స్కోరు పెద్దగా పెరగలేదు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ చెప్పుకోదగిన స్కోర్ చేసి ఆసిస్‌కు 265 పరుగుల టార్గెట్ ఇచ్చారు.
265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, చక్కని ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. షార్ట్ (74), కాన్లీ (61), ఒవెన్ (36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక సిరీస్‌లో మూడో వన్డే అక్టోబర్ 29న సిడ్నీలో జరగనుంది. ఇప్పటికే ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో, ఆ మ్యాచ్ భారత జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారింది.








