ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీల‌క‌ భేటీ

ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీల‌క‌ భేటీ

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. స‌మావేశం అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

“భారత్-ఇండోనేషియా మధ్య భద్రత, రక్షణ తయారీ, వాణిజ్యం, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఇరు దేశాల మధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా వివ‌రించారు. ఆహార భద్రత, ఇంధన భద్రత, మరియు విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఈ చర్చలు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరియు సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్-ఇండోనేషియా భాగస్వామ్యం ప్రాదేశిక స్థాయిలో మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయిలో కూడా సుస్థిరతకు దోహదపడగలదని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment