బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ రిలీఫ్ దక్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను అప్పగించాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో వీసా పొడిగింపు పరిణామం చర్చనీయాంశమైంది.
జూలైలో జరిగిన హత్యలు, కొందరి అదృశ్యాలకు షేక్ హసీనా సహా 96 మంది బాధ్యత వహించారని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం హసీనాపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ విభాగం హసీనా సహా 97 మంది పాస్‌పోర్టులను రద్దు చేసింది. ఆమెను అప్పగించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు రాయబారం పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా ఢిల్లీలోని సేఫ్‌హౌస్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నివసిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్-భారత మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై ఈ పరిణామం గణనీయమైన ప్రభావం చూపనుంది.