---Advertisement---

భారత్ అద్భుత విజయం – సెమీస్‌లో ఆసీస్‌తో పోరు

India Cricket, Champions Trophy, Cricket News, India vs New Zealand, Semi-final, Australia vs India
---Advertisement---

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక పోరులో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించి, ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 249/9 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడటంతో ఈ స్కోర్ రాబ‌ట్టారు. ఓపెన‌ర్లు గిల్‌, రోహిత్ , విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఆ త‌రువాత వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అక్ష‌ర్‌ప‌టేల్‌, హార్దిక్ పాండ్యా జ‌ట్టును ఆదుకున్నారు.. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో వరుణ్ అద్భుత ప్రదర్శన కనబర్చుతూ 5 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా కుల్దీప్ 2 వికెట్లు తీసి కీలక సహకారం అందించాడు. సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. తన పరిపూర్ణమైన ఆటతీరును టీమిండియా కొనసాగిస్తుందా? ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment