---Advertisement---

భారత్‌తో కలిసి పనిచేస్తాం.. – చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన

భారత్‌తో కలిసి పనిచేస్తాం.. - చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన
---Advertisement---

భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండు దేశాలు కలిసి అభివృద్ధి చెందేందుకు కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, స్వేచ్ఛాభివృద్ధి మెరుగుప‌డ‌నున్నాయి.

రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య జరిగిన సమావేశాన్ని వాంగ్ యీ గుర్తుచేశారు. భారత్-చైనా సంబంధాల మెరుగుదలకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నుంచి సానుకూలమైన స్పందన లభించింది అని ఆయన చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment