న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు ఆరు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత్ బ్యాట్‌మెన్స్ రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచాడు.
కివీస్ బ్యాటింగ్‌లో డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) మెరిశారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) మద్దతునిచ్చారు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ చెరో వికెట్ తీసుకున్నారు.
భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలవగా, 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పుడు 2025లోనూ అదే సత్తా చాటింది. టీమిండియా విజయంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.