పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) ఘటన భారతదేశాన్ని (India) తీవ్రంగా కలిచివేసింది. ఇది పాకిస్తాన్ (Pakistan) కుట్రేనని ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతున్న తరుణంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతా (Twitter Account)ను దేశంలో నిలిపివేసింది. ఇప్పుడు ఆ ఖాతాను ఓపెన్ చేస్తే “Account Withheld in India” అనే సందేశం మాత్రమే కనిపిస్తోంది.
ఈ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాక్ సంబంధాలపై అనుమానాలు వ్యక్తం కావడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర రాకపోకలు, దౌత్య సంబంధాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని సమాచారం.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పాక్కు గట్టి సంకేతమనే చెప్పాలి. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే దేశాలపై భారత్ నిఖార్సైన వైఖరిని కొనసాగిస్తోందన్న అభిప్రాయం విశ్లేషకులది. త్వరలోనే పాక్కు గుణపాఠం తప్పదనే హెచ్చరికలు వ్యక్తం అవుతున్నాయి.