భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?

భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ (England)లో టెస్ట్ సిరీస్ (Test Series) ఆడుతున్న టీమిండియా (Team India)కు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పర్యటించాల్సి ఉంది. అయితే, భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సిరీస్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ(BCCI)కి భారత ప్రభుత్వం (Indian Government) అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఈ సిరీస్ ప్రస్తుతానికి జరిగేలా కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి తగ్గే వరకు ఈ సిరీస్ వాయిదా (Postponement) పడే అవకాశం ఉంది.

టీమిండియా ఖాళీ సమయం, ప్రత్యామ్నాయాలపై చర్చ
భారత్‌తో సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉన్నప్పటికీ, టీమిండియాను పంపేందుకు కేంద్రం సుముఖంగా లేదు. బంగ్లాదేశ్‌తో సిరీస్ దాదాపుగా రద్దు కావడంతో, భారత్ తదుపరి ఆడబోయే సిరీస్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

అయితే, ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దైతే, దాదాపు రెండు నెలల వరకు టీమిండియా ఆటగాళ్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, మరో జట్టుతో సిరీస్ ఆడే అవకాశం ఉందా? లేక తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందా? అనేది తేలాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment