తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) సిద్ధమైంది. లోక్‌సభ (Lok Sabha), వివిధ రాష్ట్రాల అసెంబ్లీ (Assembly) స్థానాలను భారీగా పెంచాలని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కీలక బిల్లును ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేదా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఆమోదించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాజకీయాల్లోకి రావాలనుకునే కొత్త తరం నేతలకు, మహిళలకు ఒక సువర్ణావకాశం కానుంది.

వివాదాలకు తావు లేకుండా ’50 శాతం’ పెంపు
సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) (Delimitation) జనాభా ప్రాతిపదికన చేపడితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు (Southern States) అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. అయితే, ఈసారి ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా, వివాదాలకు తావు లేకుండా ప్రస్తుతమున్న స్థానాలను నేరుగా 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా సీట్లు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 543 నుండి 816 వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. అసెంబ్లీ స్థానాలు 4,123 నుండి 6,185కి చేర‌నున్నట్టుగా స‌మాచారం.

ఏపీలో భారీగా సీట్ల పెంపు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పునర్విభజన చట్టంలోని హామీల మేరకు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. తాజా నిర్ణయం ప్రకారం 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికన తీసుకుని సీట్లను పెంచనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 263కు చేర‌నుంది. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపు అమలైతే అసెంబ్లీ సీట్లు 175 + 88 = 263, లోక్‌సభ సీట్లు 25 + 13 = 38కి చేర‌నున్నాయి. ఒకేసారి మహిళా (Women) బిల్లును కూడా వర్తింపజేయనుండటంతో ఏపీలో 87 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి.

తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు
తెలంగాణలో (Telangana) ప్రస్తుతం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50% పెంపుతో అసెంబ్లీ సీట్లు 119 + 60 = 179, లోక్‌సభ సీట్లు 17 + 9 = 26కు పెర‌గ‌నున్నాయి. తెలంగాణలో మహిళలకు (Women) 60 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.

2029 లక్ష్యంగా అమిత్ షా వ్యూహం!
ఈ భారీ మార్పును 2029 సార్వత్రిక ఎన్నికల (Elections 2029) నాటికి పూర్తి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి, విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఒకే దెబ్బకు మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పెంపును అమలు చేయడం ద్వారా దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment