---Advertisement---

IND vs ENG T20: ఇంగ్లాండ్‌పై భారత్ సంచలన విజయం

IND vs ENG T20: ఇంగ్లాండ్‌పై భారత్ సంచలన విజయం!
---Advertisement---

స్వ‌దేశీ గ‌డ్డ‌పై ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న టీమిండియా, ఐదో టీ20లోనూ అద్భుత విజయం సాధించింది. తొలత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 247 పరుగులు చేసి భారీ ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ (Abhishek Sharma) విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు.

ముంబై వాంఖ‌డే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 247 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 54 బంతుల్లో 135 స్కోర్ చేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై విరుచుకప‌డ్డాడు. విధ్వంసకరంగా ఆడి శతకం సాధించాడు. 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ, 37 బంతుల్లో సెంచరీ సాధించాడు.

భారీ ల‌క్ష్యంలో క్రీజ్‌లోకి దిగిన ఇంగ్లాండ్ కేవ‌లం 97 పరుగులకే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు కుప్ప‌కూలిపోయారు. 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘన విజయం అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సాల్ట్ (53) మాత్రమే చెప్పుకోద‌గ్గ స్కోర్ చేశాడు. టీమిండియా బౌలింగ్ విభాగంలో షమి 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్, శివందూబే, అభిషేక్ శర్మ తలో 2 వికెట్లు, రవి బిష్ణోయ్ ఒక‌ వికెట్ తీశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment