భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ను ఎంచున్నారు. జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. ఆర్. అశ్విన్, హర్షిత్ రాణాలను తప్పించి, రవీంద్ర జడేజా, ఆకాష్‌దీప్‌కి చోటు కల్పించారు.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా జట్టులో మార్పు చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్‌ని తీసుకురావడం ద్వారా తమ బౌలింగ్ విభాగాన్ని బలపరిచారు.
అశ్విన్ స్థానంలో జడేజా ఎందుకు?
అడిలైడ్ టెస్టులో అశ్విన్ తక్కువ ప్రభావం చూపడంతో, జట్టులో ఆ మార్పు తప్పనిసరి అయింది. అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సాధారణ ప్రదర్శన కనబరచగా, రవీంద్ర జడేజా ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో 16 వికెట్లు తీసి మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ పిచ్‌లో స్పిన్నర్ కీలక పాత్ర పోషిస్తాడని కెప్టెన్ రోహిత్ విశ్వసిస్తున్నారు.
ఆకాష్‌దీప్‌కి తొలి ఛాన్స్
హర్షిత్ రాణా అడిలైడ్ టెస్టులో నిరుత్సాహకర ప్రదర్శన తర్వాత, ఫార్మ్‌లో ఉన్న ఆకాష్‌దీప్‌కి అవకాశమిచ్చారు. అతని బౌలింగ్ నైపుణ్యాలను మహ్మద్ షమీతో పోల్చి చూసే స్థాయిలో ఉన్నాయి. గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం కావడంతో, ఆకాష్‌దీప్ తాను బాగా రాణించగలడని భావించారు.
భారత ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్.