హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమ్రాన్ ఖాన్ న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వివాదాల్లో ఇరుక్కొంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కాకుండా, హైదరాబాద్‌కు చెందిన పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల దర్యాప్తు ప్రారంభమైన తర్వాత, భయంతో కొందరు తమ ప్రమోషనల్ వీడియోలను డిలీట్ చేశారని సమాచారం. అయితే, ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ కావడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇమ్రాన్ అరెస్ట్ అవుతారా?
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఇమ్రాన్ ఖాన్‌ను త్వరలో అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో అనైతిక ప్రమోషన్లపై పోలీసుల కఠినంగా వ్యవహరించడం ఖాయమని తెలుస్తోంది.