ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన

ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవ‌మానం జ‌రిగింది. త‌మిళ‌నాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి ఆయ‌న్నుఆపి బయటకు పంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు వర్గాల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో పెళ్లికాని యువతులు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి, సమీపంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్లి ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు ప‌టిస్తారు. ఈ ఆచారం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోంది.

ఈరోజు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో ఇళ‌య‌రాజాను ఆపి బ‌య‌ట‌కు పంపించ‌డంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారుల నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment